హైదరాబాద్‌లోని గచ్చిబౌలి కాల్పుల కేసులో కీలక విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. బత్తుల ప్రభాకర్ నుంచి మూడు తుపాకులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. బీహార్ గ్యాంగ్ నుంచి తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు గుర్తించారు. ప్రిజం పబ్బులో పోలీసులపై కాల్పులు జరిపి తప్పించుకునే ప్రయత్నం చేసిన ప్రభాకర్ నుంచి ఘటన స్థలంలోనే రెండు తుపాకులు స్వాధీనం చేసుకున్నారు. గచ్చిబౌలిలోని ప్రభాకర్ గదిలో తనిఖీలు చేయగా మరొక తుపాకీని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మల్టీ నేషనల్ కంపెనీలో పనిచేస్తున్న స్నేహితుడి రూమ్‌లో బస చేసిన ప్రభాకర్, వైజాగ్ జైలులో తనతో పాటు ఉన్న ఖైదీని చంపేందుకు ప్రభాకర్ తుపాకులు కొనుగోలు చేసినట్లు పోలీసులు నిర్థారించారు. జైలులో తనను చిత్రహింసలు పెట్టినందుకు తోటి ఖైదీని చంపేందుకు ప్రభాకర్ కుట్ర పన్నినట్లు సమాచారం.
గచ్చిబౌలి కాల్పుల కేసులో నిందితుడు నుంచి మూడు తుపాకుల స్వాధీనం
February 02, 2025
0
Tags