తెలంగాణలోని మిర్యాలగూడ పట్టణంలో అద్దంకి నార్కెట్ పల్లి రహదారి పై చింతపల్లి బైపాస్ వద్ద ఆదివారం తెల్లవారుజామున పెళ్లికి వెళ్లి వస్తున్న ఓ ప్రైవేట్ బస్సు ట్రాక్టర్ ను వెనకవైపు నుంచి ఢీ కొట్టడంతో ఒక మహిళ మృతి చెందగా 15 మందికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం నెల్లూరుకు చెందిన పలువురు హైదరాబాదులో ఓ పెళ్లికి హాజరై ప్రైవేట్ బస్సులో హైదరాబాద్ నుండి నెల్లూరుకు వెళ్తున్నారు. ఈ క్రమంలోనే మిర్యాలగూడ మండలం వాటర్ ట్యాంక్ తండాకు చెందిన ట్రాక్టర్ ను వెనక వైపు నుండి బస్సు బలంగా ఢీ కొట్టింది. దీంతో ట్రాక్టర్ పై ప్రయాణం చేస్తున్న నునావత్ సునీత అక్కడికక్కడే మృతి చెందగా, ట్రాక్టర్ డ్రైవర్ నునావత్ సైదాకు తీవ్ర గాయాలు అయ్యాయి. బస్సులో ప్రయాణం చేస్తున్న నెల్లూరుకు చెందిన రాజశేఖర్, నాగ చరిత, శైలజ, రాధ, అఖిల, శివరామకృష్ణ, సురేందర్ రావులతో పాటు బస్సు డ్రైవర్, క్లీనర్ లకు గాయాలయ్యాయి. కాగా ట్రాక్టర్ డ్రైవర్ సైదాతో పాటు మరో ఇద్దరికి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. గాయపడిన వారిని చికిత్స నిమిత్తం మిర్యాలగూడ పట్టణంలోని పలువురిని ప్రైవేట్ ఆస్పత్రులు చేర్పించగా, మిగిలిన వారికి చికిత్స అందిస్తున్నారు.
అద్దంకి నార్కెట్పల్లి రహదారిపై ట్రాక్టర్ ను ఢీకొట్టిన ప్రైవేట్ పెళ్లి బస్సు
February 23, 2025
0