ముంబైకి చెందిన నిషా పాటిల్‌కు బాలీవుడ్ హీరో సంజయ్ దత్ అంటే విపరీతమైన అభిమానం. తొలి నుంచి కూడా ఆయనను అభిమానిస్తుంది. ఆయన ప్రతి సినిమాను లెక్కలేనన్ని సార్లు చూసింది. ఇటీవలే ఆమె కన్నుమూసింది. ఆమె వయసు 62 యేళ్లు. కాగా, ఆమె పేరిట దాదాపు రూ.72 కోట్ల విలువ చేసే ఆస్తులు ఉన్నాయి. తనకు చివరి రోజులు దగ్గర పడుతున్నాయని విషయాన్ని గ్రహించిన నిషా పటేల్ 2018లోనే తన ఆస్తి, బ్యాంకు ఖాతాల్లో ఉన్న డబ్బు సంజయ్ దత్‌కు చెందేలా వీలునామా రాయించింది. ఆమె చనిపోయిన తర్వాత ఆమె వీలునామా దస్తావేజులు తీసుకొని సంజయ్ దత్ ఇంటికి వచ్చారు. విషయం తెలిసిన సంజయ్ దత్ షాక్ గురయ్యారు. పరిచయం లేని వ్యక్తి ఆస్తి రాసివ్వడం చూసి చలించిపోయారు. అయితే, ఆ ఆస్తిని సంజయ్ దత్ తీసుకోలేదు. ఆ ఆస్తి తిరిగి ఆమె కుటుంబానికి చెందేలా చూడాలని తన లీగల్ టీమ్‌కు సూచించారు. ఇంత గొప్ప అభిమానిని కలవలేకపోవడం బాధగా ఉందని చెప్పారు. కనీసం ఆమె కుటుంబ సభ్యులైనా కలిసి కొంత ఊరట చెందుతానని అన్నారు.
రూ.72 కోట్ల ఆస్తిని సంజయ్ దత్‌కు రాసిచ్చిన మహిళా వీరాభిమాని !
February 11, 2025
0
Tags