2024- 25 సంవత్సరం చివరి త్రైమాసికం (అక్టోబర్ - డిసెంబర్)లో వాస్తవ జిడిపి వృద్ధిరేటు 6.2 శాతం మేర నమోదైందని శుక్రవారం స్టాటిస్టిక్స్ అండ్ ప్రొగామ్ ఇంప్లిమెంటేషన్ మంత్రిత్వశాఖ అధికారిక డేటా తెలిపింది. జులై - సెప్టెంబర్ త్రైమాసికం కంటే చివరి త్రైమాసికం (అక్టోబర్ - డిసెంబర్)లోనే ఎక్కువ జిడిపి వృద్ధిరేటు నమోదైంది. రెండో త్రైమాసికంలో 5.6 శాతం వృద్ధిరేటు నమోదైతే.. చివరి త్రైమాసికంలో 6.2 శాతం మేర నమోదైంది. అయితే ఆర్‌బిఐ ఈ త్రైమాసికంలో 6.8 శాతం మేర జిడిపి వృద్ధి రేటు నమోదు కావొచ్చని అంచనా వేసింది. ఆర్‌బిఐ అంచనా కంటే తక్కువగానే జిడిపి నమోదైంది. ఇక 2024-25 సంవత్సరానికి వాస్తవ జిడిపి వృద్ధిరేటు 6.6 శాతం మేర నమోదు కావొచ్చని ఆర్‌బిఐ అంచనా వేసింది. జనవరి - మార్చి త్రైమాసికంలో 7.2 శాతం జిడిపి వృద్ధి చెందుతుందని ఆర్‌బిఐ అంచనా వేసింది.
చివరి త్రైమాసికంలో జిడిపి వృద్ధి రేటు 6.2 శాతం
February 28, 2025
0
Tags