వీలునామాలో మోహన్‌ దత్తాకు రూ.500 కోట్ల ఆస్తిని రాసిన రతన్‌ టాటా ?

Telugu Lo Computer
0


ప్రముఖ పారిశ్రామికవేత్త రతన్ టాటా తన ఆస్తిలో రూ.500 కోట్లకు పైగా ఆస్తులను మోహన్‌ దత్తాకు చెందేలా రతన్ టాటా వీలునామాలో పేర్కొన్నట్టు సమాచారం. టాటా కుటుంబ సభ్యులు కూడా ఆ వీలునామా చూసి షాక్ అయ్యారని తెలుస్తోంది. రతన్ టాటా వీలునామాలో ప్రస్తావించిన ఆ వ్యక్తి జంషెడ్‌పూర్‌కు చెందిన ట్రావెల్ సెక్టార్ వ్యాపారవేత్త మోహిని మోహన్ దత్తాగా చెబుతున్నారు. మోహన్‌ దత్తా, అతని కుటుంబం ట్రావెల్ ఏజెన్సీ స్టాలియన్‌ను కలిగి ఉన్నారు. దీనిని 2013లో తాజ్ గ్రూప్ ఆఫ్ హోటల్స్‌లో భాగమైన తాజ్ సర్వీసెస్‌తో విలీనం చేశారు. మోహిని దత్తా కుటుంబం స్టాలియన్‌లో 80 శాతం వాటాను కలిగి ఉంటే, 20 శాతం వాటా టాటా ఇండస్ట్రీస్ యాజమాన్యం కలిగి ఉంది. ఆయన థామస్ కుక్ మాజీ అనుబంధ సంస్థ అయిన TC ట్రావెల్ సర్వీసెస్‌కు డైరెక్టర్‌గా కూడా పనిచేశారు. ఆయన టాటా వద్ద ఆరు దశాబ్దాలకు పైగా నమ్మకంగా పని చేశారు. అంతే కాకుండా టాటా కుటుంబానికి దత్తా చాలా సన్నిహితంగా ఉండేవారని అంటున్నారు. రతన్ టాటా మరణించినప్పుడు ఆయనతో తనకున్న సాన్నిహిత్యం గురించి దత్తా మాట్లాడుతూ టాటా తనకు 24 ఏళ్ల వయసు ఉన్నప్పటి నుంచి తెలుసని చెప్పారు. తాను జీవితంలో ఎదగడానికి టాటా ఎంతో సాయం చేశారని తెలిపారు. దీంతోనే మోహిని మోహన్ దత్తాకు తన ఆస్తిలో రూ.500 కోట్లు ఇవ్వాలని రతన్‌టాటా నిర్ణయించినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయంలో ఎటువంటి అధికారిక ప్రకటన ఇంకా వెలువడలేదు.


Post a Comment

0Comments

Post a Comment (0)