త్వరలో రెడ్ మీ బుక్ ప్రో 2025 ల్యాప్ టాప్ విడుదల !

Telugu Lo Computer
0


రెడ్ మీ నుంచి రెడ్ మీ బుక్ ప్రో 2025 ల్యాప్ టాప్ అధునాతన ఫీచర్లు, శక్తివంతమైన హార్డ్‌వేర్, ఆకట్టుకునే డిజైన్‌తో మార్కెట్లోకి రానున్నది.  గిజ్మోచినా నివేదిక ప్రకారంఈ మోడల్‌ ఇంటెల్ కోర్ అల్ట్రా 5 ప్రాసెసర్‌తో రానున్నది. ఈ విషయాన్ని షియోమి ఉత్పత్తి మార్కెటింగ్ డైరెక్టర్ మా జియు చైనా సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్ వీబోలో పంచుకున్నారు. ల్యాప్‌టాప్‌లు ఇంటెల్ ఆర్క్ ఇంటిగ్రేటెడ్ గ్రాఫిక్స్‌తో వస్తాయని నిర్ధారించే స్టిక్కర్లు కూడా కనిపించాయి. ప్రస్తుతానికి, ఇంటెల్ కోర్ అల్ట్రా 5 మొదటి తరం చిప్‌సెట్ లేదా సిరీస్ 2 చిప్‌సెట్ అనేది స్పష్టంగా తెలియరాలేదు. గ్రాఫిక్స్ సెట్టింగ్‌ల వివరాలు కూడా ప్రస్తుతానికి వెల్లడించలేదు, కానీ నోట్‌బుక్ సగటున 67 FPS సాధించగలిగిందని, గరిష్ట ఫ్రేమ్ రేట్ 75 FPS, అతిపెద్ద డ్రాప్ కేవలం 59 FPS మాత్రమేనని మార్కెట్ వర్గాలు భావిస్తున్నాయి.


Post a Comment

0Comments

Post a Comment (0)