12న శాంసంగ్ గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల

Telugu Lo Computer
0


దేశీయ మార్కెట్లో 12న శాంసంగ్  గెలాక్సీ F06 5G స్మార్ట్‌ఫోన్‌ విడుదల కానుంది. ఈ ఫోన్ ధర రూ.9000-9,999 మధ్య ఉండొచ్చని అంచనావేస్తున్నారు. గత సంవత్సరం రూ.7,999కి లాంచ్ అయిన గెలాక్సీ F05కి సక్సెసర్‌గా దీన్ని  తీసుకొస్తోంది. బహమా బ్లూ, లిట్‌ వయోలెట్‌ కలర్‌ ఆప్షన్లలో లభించనున్నది. ఫ్లిప్‌కార్ట్‌, శాంసంగ్‌ ఈ-స్టోర్‌ల్లో విక్రయిస్తారు. గెలాక్సీ F06 5G, గెలాక్సీ F05 కంటే కొద్దిగా భిన్నంగా కనిపిస్తుంది. ఇది ఫ్లాట్ డిజైన్‌ను కలిగి ఉంటుంది. ఈ ఫోన్‌లో లేత నీలం రంగు బ్యాక్ ప్యానెల్ ఉంది. శాంసంగ్ గెలాక్సీ ఎఫ్‌06 5జీ ఫోన్‌ MediaTek Helio G85 ప్రాసెసర్‌తో వస్తుంది. 8 జీబీ ర్యామ్‌, 64 జీబీ స్టోరేజీ వేరియంట్‌తో రానుంది. మైక్రో ఎస్డీ కార్డ్‌ సాయంతో ఒక టిగా బైట్‌ వరకూ పొడిగించుకోవచ్చు. అద్భుతమైన ఫోటోగ్రఫీ అనుభవం కోసం ఫోన్ 50MP డ్యూయల్ కెమెరా సెటప్‌తో వస్తుంది. మంచి స్పష్టత కోసం ఫోన్‌లో 2MP డెప్త్ సెన్సింగ్ కెమెరా ఉంది. అధిక నాణ్యత గల సెల్ఫీల కోసం ఈ ఫోన్ 8MP ఫ్రంట్ కెమెరాతో వస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)