మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్-100 టెన్నిస్ టోర్నీ పురుషుల డబుల్స్ విభాగంలో టాప్ సీడ్ జీవన్ నెడుంజెళియన్-విజయ్ సుందర్ ప్రశాంత్ (భారత్) జంట చాంపియన్‌గా నిలిచింది. శనివారం జరిగిన ఫైనల్లో జీవన్-విజయ్ జంట 3-6, 6-3, 10-0తో రెండో సీడ్ బ్లేక్ బేల్‌డన్-మాథ్యూ క్రిస్టోఫర్ (ఆ్రస్టేలియా) ద్వయంపై విజయం సాధించింది. జీవన్-విజయ్ జోడీకి సంయుక్తంగా ఇదే తొలి టైటిల్ కాగా విజయ్ సుందర్ పుణేలో మూడో సారి విజేతగా నిలిచాడు. తొలి సెట్‌లో పరాజయం పాలైన భారత జంట ఆ తర్వాత ప్రత్యర్థికి ఏమాత్రం అవకాశం ఇవ్వకుండా విజృంభించింది. 2 ఏస్‌లు సంధించిన జీవన్-విజయ్ జోడీ మూడు డబుల్ ఫాల్ట్స్ చేసింది. ఈ విజయంతో రూ. 7 లక్షల నగదు బహుమతితో పాటు 100 ర్యాంకింగ్స్ పాయింట్లు భారత ప్లేయర్ల ఖాతాలో చేరాయి. దీంతో ఏటీపీ ర్యాంకింగ్స్‌లో జీవన్ 94వ స్థానానికి, విజయ్ 104వ ర్యాంక్‌కు చేరనున్నారు.
మహా ఓపెన్ ఏటీపీ చాలెంజర్-100 టెన్నిస్ టోర్నీలో జీవన్-విజయ్ జోడీకి టైటిల్
February 23, 2025
0
Tags