హైదరాబాద్‌లోని హుస్సేన్‌సాగర్‌లో ఆదివారం భరతమాతకు మహా హారతి కార్యక్రమం నిర్వహించారు. దీన్ని చూసేందుకు అజయ్ తన స్నేహితులతో వచ్చాడు. బాణసంచా కాలుస్తుండగా మంటలు అంటుకుని రెండు బోట్లు దగ్ధమయ్యాయి. అప్పటి నుంచి అజయ్ కనిపించడం లేదు. సోమవారం ఉదయం హుస్సేన్‌సాగర్ వద్దకి కుటుంబ సభ్యులు చేరుకుని పోలీసులకు ఫిర్యాదు చేశారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు పోలీసులు గాలింపు చర్యలు కొనసాగిస్తున్నారు. అజయ్‌తో పాటు వెళ్లిన స్నేహితులు సురక్షితంగా ఉన్నారని చెప్పారు. దీంతో రెండు రెస్క్యూ బృందాలతో పోలీసులు గాలింపు చేపట్టారు. మరికొన్ని బృందాలను రప్పిస్తున్నట్లు అధికారులు తెలిపారు.
హుస్సేన్‌సాగర్ అగ్ని ప్రమాద ఘటనలో యువకుడి అదృశ్యం
January 27, 2025
0
Tags