ప్రజల సంపద, జ్ఞానం, ఆనందాన్ని పెంచాలి : వెంకయ్య నాయుడు

Telugu Lo Computer
0

భారత ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ, ఉన్నత్ భారత్ అభియాన్ సహకారంతో యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ "2025లో భారతదేశాన్ని అభివృద్ధి చేయడం, గ్రామీణ యువతను సాధికారత చేయడం" అనే అంశంపై రెండు రోజుల జాతీయ సదస్సు జరిగింది. ఈ కార్యక్రమం గ్రామీణ యువతకు నైపుణ్యాభివృద్ధి, జీవనోపాధి, సమాజ అభివృద్ధి కోసం అవసరమైన నైపుణ్యాలను అందించడం లక్ష్యంగా పెట్టుకుంది. ఈ టెక్నికల్ సెషన్ తరువాత రెండో రోజు భారత మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్య నాయుడు  "డెవలప్డ్ ఇండియా@2047, వాయిస్ ఆఫ్ యూత్" పేరుతో ప్రత్యేక ప్రసంగం చేశారు. ఆయన ప్రజల సంక్షేమం కోసం గ్రామీణ ప్రాంతాల్లో నైపుణ్యాభివృద్ధి కోసం నూతన మార్గాలను వెతకాలని సూచించారు. భారతదేశ అభివృద్ధి 143 కోట్ల మంది పౌరులకు, ముఖ్యంగా బలహీనవర్గాలకు ప్రయోజనం చేకూర్చాలని అన్నారు. ఆయన ఉద్ఘాటించిన ముఖ్యమైన అంశం "మన ప్రజల సంపద, జ్ఞానం, ఆనందాన్ని మనం పెంచాలి".భారతదేశం మన మాతృభూమి అని, దానిని కాపాడుకోవాలనే అభిరుచి మనకు ఉండాలన్నారు. ఆవిష్కరణలు సమర్థమైనవై, అందుబాటులో ఉండేలా చూడాలన్నారు. గ్రామీణ ప్రాంతాల నుంచి ఇతర ప్రాంతాలకు వలసలు పెరుగుతున్నాయని, ఈ సవాళ్లను ఎదుర్కొనేందుకు వినూత్న పరిష్కారాలను వెతకాల్సిన అవసరం ఉందని వెంకయ్య నాయుడు విద్యార్థులకు సూచించారు. భారతదేశం గొప్ప కళాత్మక వారసత్వాన్ని కల్గి ఉందని, అభివృద్ధి ఫలాలు అందరికీ అందేలా చూడాలన్నారు. బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి పాటుపడాలని వెంకయ్య కోరారు. సంస్కరణల పనితీరు పరివర్తనపై ప్రధానమంత్రిగారు ఇచ్చిన మంత్రమైన "మనమే మార్పు తీసుకురావాలి, ప్రజలకు న్యాయం జరుగుతుందనే దిశలో సాగాలని చెప్పుకొచ్చారు. ప్రభుత్వ కార్యక్రమాల ప్రయోజనాలు ప్రజలకు చేరేలా చూడడం అవసరమని ఆయన వెల్లడించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)