భాజపా అభ్యర్థి రవీందర్‌ సింగ్‌ నేగి పాదాలకు మొక్కిన మోడీ : వీడియో నెట్టింట వైరల్‌

Telugu Lo Computer
0


ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా ఇటీవల భాజపా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆసక్తికర సంఘటన చోటు చేసుకొంది. ఈ సభలో పాల్గొన్న ప్రధాని నరేంద్ర మోడీ తన వద్దకు వచ్చిన భాజపా అభ్యర్థి పాదాలకు నమస్కరించారు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్‌గా మారింది. ఇంతకీ అతడెవరు? అసలు ఆయన పాదాలకు ప్రధాని ఎందుకు నమస్కరించారనే దానిపై చర్చ జరుగుతోంది. బుధవారం ఢిల్లీలో భాజపా బహిరంగ సభ ఏర్పాటు చేసింది. దీనికి హాజరైన ప్రధానిని పార్టీ నేతలంతా కలిశారు. ఈ క్రమంలోనే వేదికపై ఉన్న మోడీ వద్దకు భాజపా అభ్యర్థి రవీందర్‌ సింగ్‌ నేగి వచ్చారు. ఆయన పాదాలకు నమస్కారం చేశారు. వెంటనే అతడిని అడ్డుకున్న ప్రధాని రవీందర్‌ పాదాలకు మూడు సార్లు నమస్కారం చేశారు. దీంతో అతడు ఎవరనే అంశంపై సోషల్‌ మీడియాలో చర్చ మొదలైంది. రవీందర్‌ సింగ్‌ నేగి ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ కౌన్సిలర్‌. పట్‌పర్‌గంజ్‌లోని వినోద్‌ నగర్‌కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో ఈయన కాంగ్రెస్‌, ఆప్‌ అభ్యర్థులు అనిల్‌ కుమార్‌, అవధ్‌ ఓజాకు పోటీగా బరిలోకి దిగారు. 2020లో మాజీ డిప్యూటీ సీఎం మనీశ్‌ సిసోదియాకు ప్రత్యర్థిగా పోటీ చేసిన రవీందర్‌ రెండు శాతం ఓట్ల తేడాతో ఓడిపోయారు. 2022లో జరిగిన ఢిల్లీ మున్సిపల్‌ కార్పొరేషన్‌ ఎన్నికల్లో ఆప్‌ అభ్యర్థిపై 2 వేలకు పైగా ఓట్లతో విజయం సాధించారు.


Post a Comment

0Comments

Post a Comment (0)