తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్‌ వాళ్లకు చూపించి మెడలు వంచుతా : కేసీఆర్‌

Telugu Lo Computer
0


కేసీఆర్ మళ్ళీ సీఎం కావాలని ఆకాంక్షిస్తూ బీఆర్‌ఎస్‌ కార్యకర్తలు ఈ నెల 27న జహీరాబాద్ నుంచి పాదయాత్రగా ఇవాళ ఎర్రవల్లికి చేరుకున్నారు. ఈ సందర్భంగా కార్యకర్తలతో ఎర్రవల్లి ఫామ్ హౌస్‌లో కేసీఆర్‌ సమావేశమయ్యారు. ఈ సమావేశంలో కేసీఆర్‌ మాట్లాడుతూ ఇన్ని రోజులుగా నేను మౌనంగా ఉన్నా, గంభీరంగా చూస్తున్నా. నేను కొడితే మామూలుగా ఉండదు. తెలంగాణ శక్తి ఏందో కాంగ్రెస్‌ వాళ్లకు చూపించి మెడలు వంచుతా. కాంగ్రెస్‌ ఏడాది పాలనలో తెలంగాణ ప్రజలు సంతోషంగా లేరు. కాంగ్రెస్‌ వాళ్లు దొరికితే ప్రజలు కొట్టేలా ఉన్నారు. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేశారు. నిన్న కాంగ్రెస్‌ వాళ్లు ఓటింగ్‌ పెడితే మనకే ఎక్కువ ఓటింగ్‌ వచ్చింది. నేను చెప్పినా వినలేదు. అత్యాసకు పోయి కాంగ్రెస్‌కు ఓటేశారు. మన విజయం తెలంగాణ విజయం కావాలి. భూముల ధరలు అమాంతం పడిపోయాయి. ప్రత్యక్ష పోరాటాలకు సిద్ధం కండి. ఫిబ్రవరి నెలాఖరున భారీ బహిరంగ సభ పెడుతున్నాం. మీరందరూ తప్పకుండా రావాలి. ఓట్ల కోట్ల కోసం కాంగ్రెస్‌ ముస్లింలను వాడుకుంటుంది. సంగమేశ్వ, బసవేశ్వర టెండర్లను ఎందుకు పిలవలేదు. కాంగ్రెస్‌పై అంతటా అసంతృప్తే. అన్ని వర్గాలను కాంగ్రెస్‌ ముంచేసింది. పాలన వైఫల్యాలను ఎత్తి చూపితే కేసులు పెడుతున్నారు. రైతుబంధుకి రాంరాం, దళితబంధుకు జైభీం చెబుతారని ఆనాడే చెప్పా. అన్నీ మబ్బులు తొలగి పోయి అన్నీ బయటకు వస్తున్నాయి. మంచేదో చెడేదో ప్రజలకు తెలుస్తోంది. తులం బంగారానికి ఆశపడి కాంగ్రెస్‌కు ఓటేశారు. రాబోయే రోజుల్లో విజయం మనదే. మనం విజయం తెలంగాణ విజయం కావాలి. కైలాసం ఆడితే పాము మింగినట్లుగా ఉంది పరిస్థితి. మాట్లాడితే ఫామ్‌ హౌస్‌, ఫామ్‌ హౌస్‌ అని బద్నం చేస్తున్నారు. ఫామ్‌ హౌస్‌లో పంటలే ఉంటాయి కదా' అని వ్యాఖ్యానించారు. 

Post a Comment

0Comments

Post a Comment (0)