టాటా ప్లే నుంచి 'సిర్ఫ్ లగే మెహెంగా' !

Telugu Lo Computer
0


కొత్త ఏడాది, పంటల, పండగల సీజన్ ను పురస్కరించుకుని టాటా ప్లే 'సిర్ఫ్ లగే మెహెంగా' అనే సరికొత్త క్యాంపెయిన్ ను ప్రారంభించింది. కుటుంబంలోని ప్రతి సభ్యుని ఎంపికలకు అనుగుణంగా, వినోదం, వార్తలు, క్రీడలు, సంగీతం, సినిమాలు, భక్తి, కిడ్స్, తదితర కళా ప్రక్రియలతో సహా విస్తృతమైన, బడ్జెట్-ఫ్రెండ్లీ, అధిక నాణ్యతతో కూడిన వినోద అనుభవాన్ని టాటా ప్లే తెలుగు సూపర్ వాల్యూ ప్యాక్ అందిస్తుంది. ఓగిల్వీ తెరకెక్కించిన 'సిర్ఫ్ లగే మెహెంగా' క్యాపెయిన్ ను డీటీహెచ్ సేవలు ఖరీదైనవి అనే అపోహను హాస్యాస్పదంగా తొలగించే ఓవర్ స్టేట్మెంట్ పేరడీ చిత్రాల శ్రేణిని ప్రదర్శిస్తుంది. టాటా ప్లే ప్రపంచ స్థాయి వినోదాన్ని సరసమైన ధరకు ఎలా అందజేస్తుందో, రాజీలేని వీక్షణ అనుభవాన్ని ఎలా అందజేస్తుందో ఈ వాణిజ్య ప్రచార చిత్రాలు హైలైట్ చేస్తాయి. ఒత్తిడితో గోళ్లు కొరికే పరిస్థితులల్లోనూ హాస్యాన్ని పండించడం ద్వారా, టెలివిజన్ లో అందుబాటులో ఉండే అసలైన, ప్రీమియం వినోదాన్ని కనుగొనడంలో ఉన్న ఆనందాన్ని ఈ వాణిజ్య చిత్రాలు వివరిస్తాయి. దేశవ్యాప్తంగా ఉన్న వీక్షకులను ఆకర్షించేందుకు వివిధ భాషల్లో ఈ క్యాంపెయిన్ అందుబాటులోకి వచ్చింది. టాటా ప్లే భౌగోళికాలు, శ్రేణులు, ప్రాంతాలు, విభాగాల వ్యాప్తంగా ప్రేక్షకులకు విలువ-ఆధారిత వినోదాన్ని అందించడంలో సరికొత్త కొలమానాలను సెట్ చేస్తూనే ఉంది. నెలకు రూ.255తో ప్రారంభమయ్యే ప్యాక్లతో, వీక్షకులు టాటా ప్లే వెబ్ సైట్ ని https://www.tataplay.com/ సందర్శించడం ద్వారా లేదా టాటా ప్లే మొబైల్ యాప్ లోని నిర్వహణ విభాగాన్ని సందర్శించడం ద్వారా వారి ప్యాక్ లను మార్చుకోవచ్చు లేదా ఎంచుకోవచ్చు. ఆఫర్ ను పొందేందుకు వారు తమ ప్రాంతంలో సమీపంలో ఉన్న డీలర్లను కూడా సంప్రదించవచ్చు.

Post a Comment

0Comments

Post a Comment (0)