డాక్టర్ ప్రభావతి ముందస్తు బెయిల్ ను కొట్టివేసిన హైకోర్టు !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ డిప్యూటీ స్పీకర్ రఘురామ కృష్ణంరాజుపై సీఐడీ కస్టడీలో చిత్రహింసలకు గురి చేసిన వ్యవహారంలో డాక్టర్ ప్రభావతికి హైకోర్టులో ఎదురుదెబ్బ తగిలింది. ముందస్తు బెయిల్ కోసం డాక్టర్ ప్రభావతి వేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం కొట్టివేసింది. కేసు దర్యాప్తు దశలో బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని హైకోర్టు స్పష్టం చేసింది. గతంలో జిల్లా సెషన్స్ కోర్టు కూడా ప్రభావతి దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్‌ను కొట్టివేసిన విషయం తెలిసిందే. 

Post a Comment

0Comments

Post a Comment (0)