కష్టపడి పనిచేసే సాఫ్ట్ వేర్ ఇంజనీర్ అయి సూపర్ యాప్ నిర్మించాలనే కోరిక కలిగి ఉన్నట్లయితే తమతో జతకట్టొచ్చని ట్విట్టర్ వేదికగా ప్రకటించాడు. ఇందుకోసం Code@x.comకి మెయిల్ పంపవచ్చని పేర్కొన్నాడు. పైగా పనిచేయటానికి ముందుకొచ్చే వ్యక్తి అసలు స్కూలుకు వెళ్లాడా లేదా పెద్ద కంపెనీల్లో పనిచేసిన అనుభవం ఉందా లేదా అనే అంశాలు తనకు అక్కర్లేదని, కేవలం తమ కోడింగ్ స్కిల్ చూపిస్తే జాబ్ పక్కా అంటూ తేల్చి చెప్పాడు. 2014లో టెస్లాలో పనిచేయటానికి విద్యార్హత అవసరం లేదంటూ మస్క్ ఇలాంటి ప్రకటనే చేసిన సంగతి తెలిసిందే. స్సేస్ ఎక్స్ లో కూడా ఇలాంటి ధోరణిని మస్క్ చూపిన సంగతి తెలిసిందే. అయితే ఇదే తరహా నియమకాలను తాను కొనుగోలు చేసిన ఎక్స్ లోనూ ప్రవేశపెట్టాలని చూస్తున్నట్లు తాజా పరిణామాల బట్టి అర్థం అవుతోంది. సాంప్రదాయేతర నేపథ్యాల నుంచి వచ్చిన ప్రతిభావంతులైన వ్యక్తులకు వేదికగా దీనిని కొంతమంది పెద్ద అవకాశంగా చూస్తుండగా, మరికొందరు ఈ పద్దతిని అవలంభించటం పెద్ద స్థాయిలో అవలంభించటానికి కుదరదని అంటున్నారు. అయితే మస్క్ మాత్రం తాను కోరుకున్న రిజల్స్ట్ కోసం కొత్త మార్గాలను అందిపుచ్చుకోవటం ముందు నుంచి చేస్తూనే ఉన్న సంగతి తెలిసిందే.
చదువుతో సంబంధం లేకుండా కోడింగ్ స్కిల్ చూపిస్తే జాబ్ పక్కా : ఎలాన్ మస్క్ !
January 16, 2025
0
Tags