ఓ యువకుడు రైలు పట్టాలపై కూర్చుని ప్రేయసితో ఫోన్‌లో మాట్లాడుతున్నాడు. ముందు, వెనుకా ఏం జరుగుతున్నా పట్టించుకోలేని స్థితిలో ఉన్నంతగా ఫోన్‌లో లీనమయ్యాడు. ఇలా ఉండగా ఉన్నట్టుండి ఓ రైలింజన్ పట్టాలపై అటుగా వచ్చింది. అయినా ఆ వ్యక్తి అదేమీ పట్టించుకోకుండా ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. పట్టాలపై యువకుడు కూర్చోవడాన్ని గమనించిన రైలు డ్రైవర్ హారన్ మోగిస్తూనే ఉన్నాడు. అప్పటికీ ఆ యువకుడు కొంచెం కూడా చలనం లేకుండా అలాగే ఫోన్‌లో మాట్లాడుతూనే ఉన్నాడు. తీరా దగ్గరికి వచ్చాక ఒక్కసారిగా పక్కకు చూసి షాక్ అవుతాడు. దీంతో పైకి లేచి నిలబడతాడు. అప్పటికే తీవ్ర ఆగ్రహంతో ఉన్న రైలు డ్రైవర్ కిందకు దిగి ఆ యువకుడిని వెంబడిస్తాడు. రైలు డ్రైవర్ రావడాన్ని గమనించిన ఆ యువకుడు అక్కడి నుంచి పరుగులు తీస్తాడు. ఇలా ఫోన్‌లో మాట్లాడుతూ రైలునే గమనించిన ఈ యువకుడిని చూసి అంతా అవాక్కవుతున్నారు. ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటిజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''ప్రేమలో పడితే ఇలాగే ఉంటుంది'' అంటూ కొందరు, ''ప్రేయసితో మాట్లాడి ప్రాణం మీదకు తెచ్చుకోవడం అంటే ఇదే'' అంటూ మరికొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 98వేలకు పైగా లైక్‌లు, 5.2 మిలియన్‌కు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.
ప్రేయసితో మాట్లాడుతూ ప్రపంచాన్నే మర్చిపోవడం ఇదే : సోషల్ మీడియాలో వీడియో వైరల్ !
January 29, 2025
0
Tags