భార్యను చంపి ముక్కలుగా నరికిన కేసులో నేరం ఒప్పుకున్న నిందితుడు

Telugu Lo Computer
0


తెలంగాణలోని రంగారెడ్డి జిల్లా మీర్ పేటలో భార్యను చంపి ముక్కలుగా నరికిన కేసులో నిందితుడు నేరం ఒప్పుకున్నాడు. తన భార్య వెంకట మాధవిని  తానే చంపినట్లు భర్త గురుమూర్తి పోలీసుల ముందు అంగీకరించాడు . దర్యాప్తులో భాగంగా పోలీసులు నిందితుడు గురుమూర్తి ఇంటి ఎదురుగా, పక్కన ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించారు. అందులో జనవరి 16వ తేదీన గాని, ఆ తర్వాత గాని వెంకటమాధవి ఎక్కడా బయటకు వెళ్లినట్టుగాని, లోపలకు వచ్చినట్టు గాని కనిపించలేదు. పలుమార్లు గురుమూర్తి కొన్ని కవర్లతో బయటకు వెళ్లి రావడాన్ని గుర్తించారు. దీంతో అతడిని అదుపులోకి తీసుకుని విచారించినట్టు సమాచారం. తర్వాత వెంకటమాధవి అత్తతో ఫిర్యాదు తీసుకుని సీసీటీవీ ఫుటేజీల గురించి గురుమూర్తికి చెప్పి ప్రశ్నించారు. ఇక కేసు నుంచి బయటపడలేనని అర్థమైన గురుమూర్తి తానే హత్య చేసినట్లు ఒప్పుకున్నట్టు తెలుస్తోంది. గురుమూర్తి నేరం ఒప్పుకున్నా నిరూపించలేని స్థితిలో పోలీసులు తలలు పట్టుకుంటున్నారు. గురుమూర్తే నేరస్తుడు అని చెప్పడానికి వారి దగ్గర ఒక్క ఆధారం కూడా లేదు. పోలీసులు ముందు వెంకటమాధవి చనిపోయిందని నిరూపించాల్సి ఉంటుంది. అలా చేసినా ఆమెను భర్తే హత్య చేశాడని ప్రూవ్​చేయాలి. ఆమె ఎముకలను పొడి చేసి చెరువులో కలపడం, మాంసాన్ని పీస్​లు చేసి డ్రైనేజీల్లో వేయడంతో ఇప్పుడు వాటి ఆనవాళ్లు కూడా లేవు. ఇంట్లోనే ఆమె శరీరానికి సంబంధించిన మాంసపు ముద్ద ఏదైనా దొరికితే దాని ఆధారంగా డీఎన్ఏ టెస్ట్​చేసి చనిపోయింది వెంకటమాధవే అని తేల్చే అవకాశం ఉంటుంది. కానీ, ఇదంతా పోలీసులకు పెద్ద సవాలుగా మారింది. ప్రకాశం జిల్లాకు చెందిన వెంకటమాధవికి గురుమూర్తికి 13 ఏళ్ల క్రితం పెళ్లి అయ్యింది. వీరికి ఇద్దరు పిల్లలు. గురుమూర్తి ఆర్మీలో జవాన్​గా పని చేసి వాలంటరీ రిటైర్మెంట్​తీసుకున్నాడు. తర్వాత కంచన్​బాగ్ ​డీఆర్డీవోలో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తూ మీర్ పేట్ పీఎస్​పరిధి జిల్లెలగూడలోని న్యూ వెంకటేశ్వర కాలనీలో ఉంటున్నాడు. కొన్నాళ్ల నుంచి గురుమూర్తి తన భార్య వెంకటమాధవిపై అనుమానం పెంచుకున్నాడు. ఈ విషయంలో భార్యాభర్తలకు తరచూ గొడవలు జరుగుతూ ఉండేవి. జనవరి 16న మీర్ పేటలోని పిల్లలకు సెలవులు ఉండడంతో ఇంట్లో లేరు. ఆ రోజు కూడా గురుమూర్తి, వెంకట మాధవి గొడవపడ్డారు. దీంతో ఆవేశంలో ఉన్న గురుమూర్తి ఆమెను హత్య చేశాడు.

Post a Comment

0Comments

Post a Comment (0)