షాపింగ్ మాల్‌లో కోతి హల్‌చల్ !

Telugu Lo Computer
0


త్తరప్రదేశ్ లోని ఝాన్సీలో ఓ కోతి షాపింగ్ మాల్‌లోకి దూరి హల్‌చల్ చేసింది. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. ఝాన్సీలోని సిటీ కార్ట్ మాల్‌లోకి ప్రవేశించిన ఓ కోతి మాల్‌లోని అందరినీ పరుగులు పెట్టించింది. మాల్ అంతా కలియ తిరుగుతూ గందరగోళం సృష్టించింది. దాని చేష్టలతో మాల్‌లో వారందరినీ హడతెత్తించింది. దానిని బంధించేందుకు అక్కడ ఉన్నవారంతా నానా తంటాలు పడ్డారు. మాల్‌లో దూరిన కోతి అక్కడ ఓ మహిళ తలపైకి ఎక్కి దాడి చేసింది. యువతిని గోర్లతో గీరడం, తల లాగడం వంటివి చేసింది. పదే పదే ఆమెపై దాడి చేసింది. ఆమె కాళ్లకున్న షూ లాగేసింది. దీంతో ఆమె కంగారుపడి కేకలు వేసింది. మాల్ అంతా తిరుగుతూ పలువురిపై దాడి చేసింది. భయాందోళనకు గురైన సిబ్బంది, కస్టమర్లు.. కోతిని పట్టుకునేందుకు తీవ్రంగా ప్రయత్నించారు. అరటిపండు ఆశ చూపారు. అయినా అది ఊరుకోలేదు. గంతులేస్తూ హంగామా చేస్తూనే ఉంది. ఇక లాభం లేదనుకున్న సిబ్బంది దుప్పటితో దాన్ని బంధించాలని భావించారు. దాని తుంటరి చేష్టల ముందు వారి ప్రయత్నాలు ఫలించలేదు. ఆ కోతి వారికి చిక్కకుండా మాల్‌లోని స్టాండ్‌లపై తిరుగుతూ గందరగోళం సృష్టిస్తూ సిబ్బందిని పరుగులు పెట్టించింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్‌గా మారింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)