ఉత్తర ప్రదేశ్‌లో లడ్డూ మహోత్సవం నిర్వహిస్తున్న వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందగా, 60 మందికి పైగా భక్తులు గాయపడ్డారు. అధికారులు తెలిపిన వివరాల ప్రకారం బాగ్‌పత్‌లో ఆదినాథుడి నిర్వాణ లడ్డూ ఉత్సవాన్ని నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా చెక్కతో ఏర్పాటుచేసిన వేదిక కుప్పకూలింది. ఈ ఘటనలో ఐదుగురు మృతి చెందారు. అంతేకాక జైన శిష్యులు, పోలీసు సిబ్బందితో సహా 60 మందికి పైగా గాయపడ్డారు. మరికొంత మంది శిథిలాల కింద చిక్కుకున్నట్లు తెలుస్తోంది. అధికారులు సహాయక చర్యలు కొనసాగిస్తున్నారు. ఈ ప్రమాదంపై సీఎం యోగి ఆదిత్యనాథ్ స్పందించారు. ఘటనా స్థలంలో సహాయక చర్యలు వేగవంతం చేయాలని, క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలని అధికారులను ఆదేశించారు.
లడ్డూ మహోత్సవం నిర్వహిస్తున్న వేదిక కుప్పకూలి ఐదుగురు మృతి !
January 28, 2025
0
Tags