హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు

Telugu Lo Computer
0


హార్వర్డ్ యూనివర్సిటీ ఉచితంగా ఆన్‌లైన్‌ కోర్సులు అందించనుంది. కంప్యూటర్ సైన్స్, ప్రోగ్రామింగ్, సైబర్‌సెక్యూరిటీ, డేటా సైన్స్ వంటి పలు విభాగాల్లో ఆసక్తి ఉన్న విద్యార్థులకు ఉచితంగా ఆన్‌లైన్ కోర్సులను అందించేందుకు ముందుకు వచ్చింది. ఈ కోర్సులు కొత్త వారితోపాటు, ఇప్పటికే కొంత ఎక్స్‌పీరియన్స్‌ ఉన్నవారికి కూడా ఉపయోగపడుతుంది. వారానికి 6-7 గంటల సమయం వెచ్చిస్తే ఫ్రీగా నేర్పించేస్తారట. ఆసక్తి గల అభ్యర్థులు ఈ కోర్సులను ఆన్‌లైన్‌లో 'ప్రొఫెషనల్ అండ్ లైఫ్‌లాంగ్ లెర్నింగ్' కోసం అధికారిక హార్వర్డ్ యూనివర్సిటీ వెబ్‌సైట్‌(pll.harvard.edu)లో దరఖాస్తు చేసుకోవచ్చు. C, Python, SQL, JavaScript, HTML, CSS వంటి ల్వాంగ్వేజెస్‌తో అల్గారిథమ్‌లు, డేటా స్ట్రక్చర్‌లు, సెక్యూరిటీ, సాఫ్ట్‌వేర్ ఇంజినీరింగ్‌తో సహా అనేక రకాల అంశాలను ఈ కోర్సు కవర్ చేస్తుంది. ముందస్తు ప్రోగ్రామింగ్ అనుభవం ఉన్నా లేకపోయినా, ఈ కోర్సు అల్గారిథమిక్‌గా ఆలోచించడం, సమస్యలను సమర్ధవంతంగా పరిష్కరించడం నేర్పుతుంది. ప్రోగ్రామింగ్‌కు కొత్త అయితే, ఈ కోర్సు ఇక్కడ ఏ ఇబ్బంది లేకుండా నేర్చుకోవచ్చు. కోడ్‌ని సూచించడానికి గ్రాఫికల్ బ్లాక్‌లను ఉపయోగించే దృశ్య ప్రోగ్రామింగ్ భాష అయిన స్క్రాచ్ ద్వారా మీరు ప్రోగ్రామింగ్ నేర్చుకోవచ్చు. ఫంక్షన్‌లు, లూప్‌లు, వేరియబుల్స్, షరతులు వంటి కీలక ప్రోగ్రామింగ్ కాన్సెప్ట్‌లను ఇది కవర్ చేస్తుంది. టెక్నికల్, నాన్-టెక్నికల్ లెర్నర్‌ల కోసం రూపొందించబడిన ఈ కోర్సు సైబర్ సెక్యూరిటీకి ఒక ఇంట్రడక్షన్‌ అందిస్తుంది. ప్రస్తుత సైబర్‌ బెదిరింపుల నుంచి మీ డేటా, పరికరాలు, సిస్టమ్‌లను ఎలా రక్షించుకోవాలో దీని ద్వారా నేర్చుకోవచ్చు. భద్రత, వినియోగం, రిస్క్ మధ్య ట్రేడ్-ఆఫ్‌లను అర్థం చేసుకోవచ్చు. ఈ కోర్సు సైబర్ బెదిరింపులకు సంబంధించిన వాస్తవ-ప్రపంచ ఉదాహరణలను అందిస్తుంది. ఈ కోర్సులో డేటాబేస్‌లు, SQL (స్ట్రక్చర్డ్ క్వెరీ లాంగ్వేజ్)ని నేర్చుకోవచ్చు. రిలేషనల్ డేటాబేస్‌లను ఎలా సృష్టించాలి మరియు నిర్వహించాలని.. అలాగే టేబుల్‌లు, కీలు, పరిమితులను ఉపయోగించి వాస్తవ-ప్రపంచ డేటాను ఎలా మోడల్ చేయాలో ఇక్కడ నేర్చుకుంటారు. డేటా నార్మలైజేషన్, వీక్షణలను ఉపయోగించడం, ఇండెక్స్‌లతో ప్రశ్నలను ఆప్టిమైజ్ చేయడం వంటి టెక్నిక్‌లను కూడా ఈ కోర్సు కవర్ చేస్తుంది. వీటితో పాటు.. మెషిన్ లెర్నింగ్ అల్గారిథమ్‌లు, డేటా అనాలిసిస్‌తో ప్రాక్టికల్ ఎక్స్‌పీరియన్స్‌ పొందడంలో కోర్సు సహకరిస్తుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)