చెన్నై తీరంలో ''ఆలివ్ రిడ్లే తాబేళ్ల'' మృతి !

Telugu Lo Computer
0


చైన్నైలోని జెసెంట్ నగర్, మెరీనా బీచ్ లో ఇటీవల 400కు పైగా తాబేళ్ల కళేబరాల్ని తమిళనాడు అటవీ, మత్స్య శాఖల అధికారులు గుర్తించారు. శివారులోని నీలా౦గరై, ఉత్తండి బీచ్ల మధ్య 500కు పైగా బయటపడ్డాయి. పర్యాటకులతో రద్దీగా ఉండే కోవలం బ్లూఫ్లాగ్ బీచ్ లోనూ వంద వరకు చనిపోయాయి. ఆంధ్రప్రదేశ్, ఒడిశా తీరాల్లోనూ పలుచోట్ల ఇలాంటి పరిస్థితే ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. చెన్నై పరిసరాల్లో దొరికిన కళేబరాల నమూనాలను పరీక్షల నిమిత్తం తమిళనాడు పశుసంవర్ధక, జంతుశాస్త్ర విశ్వవిద్యాలయానికి పంపారు. పోస్టుమార్టానికి వీల్లేని వాటిని తీరాల్లోనే ఎక్కడికక్కడ పూడ్చి పెడుతున్నారు. 10-15 రోజుల క్రితం చనిపోయిన తాబేళ్ల కళేబరాలు తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ తీరాల వైపు వస్తున్నాయి. ఈ సీజన్ లో గుడ్లు పెట్టేందుకు వస్తున్న తాబేళ్లే బలవుతున్నాయి. పుట్టిన తాబేళ్లలో సాధారణంగా వెయ్యికి ఒక్కటి మాత్రమే బతుకుతుంది. మిగిలినవి సముద్ర జీవులకు ఆహారంగా మారుతాయి. చేపల వేటకు మరబోట్ల వాడకం తాబేళ్లకు ప్రాణసంకటంగా మారిందని సమాచారం. తమిళనాడు ప్రభుత్వం తాబేళ్ల మరణాలపై తీవ్రంగా స్పందించింది. మరబోట్ల పై కఠిన ఆంక్షలు విధించింది. ఆటవీ, మత్స శాఖలతో పాటు తీరగస్తీ దళాల సిబ్బంది ఇటీవల 22 మరబోట్లను స్వాధీనం చేసుకొని, కేసులు పెట్టారు. తాబేళ్ల మరణాలపై చెన్నైలోని జాతీయ హరిత ట్రైబ్యునల్ దక్షిణాది బెంచ్ సుమోటోగా విచారణ ప్రారంభించింది. నిబంధనల ప్రకారం తీరంలో 9.26 కి.మీ. 5 నాటికల్ మైళ్ళలోపు మరబోట్లలో చేపల వేటపై నిషేదం ఉంది. దీన్ని అతిక్రమించి పలువురు బోట్లను వాడుతున్నారు. కొందరు మరబోట్లలో కత్తులు, పెట్రోలు బాంబులు పెట్టుకుని వేట సాగిస్తున్నట్లు గుర్తించారు. ఐదు నాటికల్ మైళ్లలోపు చేపలు పట్టుకునేందుకు సంప్రదాయ బోట్లు వాడేవారికి మాత్రమే అనుమతి ఉంది. 

Post a Comment

0Comments

Post a Comment (0)