లారీని ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొన్న ఘటనలో నలుగురు మృతి!

Telugu Lo Computer
0


సూర్యాపేట - ఖమ్మం జాతీయ రహదారిపై ఇవాళ ఉదయం ఆగి ఉన్న లారీని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో నలుగురు మృతిచెందారు. మృతుల్లో ఇద్దరు మహిళలు, ఇద్దరు పురుషులు ఉన్నారు. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. ప్రమాదం ధాటికి బస్సు నుజ్జునుజ్జయింది. ఈ ప్రమాదం జరగడంతో ప్రయాణికులు భయాందోళనకు గురయ్యారు. స్థానికులు సమాచారం అందించడంతో వెంటనే సంఘటన స్థలానికి సూర్యాపేట డీఎస్పీ రవి, పోలీసులు చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ప్రస్తుతం సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ఖమ్మం నుంచి హైదరాబాద్ వైపు వెళ్తుండగా ఈ దుర్గటన జరిగింది. టైర్ పేలి పక్కకు ఆపుకున్న ఇసుక లారీని బస్సు ఢీ కొట్టినట్లుగా సమాచారం. 

Post a Comment

0Comments

Post a Comment (0)