5.89 శాతం పతనమైన ఇన్ఫోసిస్ షేర్లు !

Telugu Lo Computer
0


న్ఫోసిస్ షేర్లు దాదాపు 5.89 శాతం పతనం కావడంతో నారాయణమూర్తి కుటుంబ సంపదలో రూ.1,850 కోట్ల మేర హరించుకుపోయింది. ఆయన కుటుంబంలోని ఐదుగురు సభ్యులకు ఇన్ఫోసిస్ లో 4.02 శాతం షేర్లు ఉన్నాయి. వీటి విలువ రూ. 32,152 కోట్లు. గురువారం ఇన్ఫోసిస్ షేర్లు ఏకంగా 5.89 శాతం కుదేలు కావడంతో నారాయణమూర్తి కుటుంబ సంపదలో రూ. 1,850 కోట్లు క్షీణించి రూ. 30,300 కోట్లకు పడిపోయింది. ప్రస్తుతం బీఎస్ఈలో ఒక్కో షేరు ధర రూ. 1,812 పలుకుతోంది. ఇన్ఫోసిస్ షేర్ల పతనం ప్రభావం ఇతర ఐటీ కంపెనీలపైనా పడింది. కంపెనీ త్రైమాసిక ఫలితాల్లో సానుకూల ధోరణులు కనిపిస్తున్నప్పటికీ ఆరు నెలల లాభాలు మాత్రం 5.42 శాతానికి పడిపోయాయి. 

Post a Comment

0Comments

Post a Comment (0)