ఎన్టీపీసీ నుంచి రూ.290 కోట్ల విలువైన ఆర్డర్‌ను పొందినట్లు 'త్రివేణి టర్బైన్' తెలిపింది. కర్ణాటకలోని ఎన్‌టీపీసీ 'కుడ్గీ' సూపర్ థర్మల్ పవర్ ప్లాంట్‌లో 160 MWh సామర్థ్యం గల Co2-ఆధారిత స్టాండలోన్ ఎనర్జీ స్టోరేజ్ సిస్టంను ఇన్‌స్టాల్ చేసేందుకు ఆర్డర్ పొందినట్లు 'త్రివేణి టర్బైన్' తన ఎక్స్చేంజ్ ఫైలింగ్‌లో తెలిపింది. ఈ ప్రాజెక్ట్‌ను 18 నెలల వ్యవధిలో సాంకేతిక భాగస్వామి 'ఎనర్జీ డోమ్'తో కలిసి 'త్రివేణి టర్బైన్' టర్న్‌కీ (మొదలు నుంచి చివరి వరకు) ప్రాతిపదికన నిర్మిస్తుంది. ఇది పునరుద్పాదక ఇంధనం వైపు వేసే అడుగులో ఈ ఆర్డర్ ఒక మేలు రాయి అని త్రివేణీ టర్బైన్స్ ఛైర్మన్ & మేనేజింగ్ డైరెక్టర్ ధ్రువ్ ఎం సాహ్నీ తెలిపారు. త్రివేణి టర్బైన్, దేశీయంగానే కాకుండా ప్రపంచవ్యాప్తంగా పారిశ్రామిక ఆవిరి టర్బైన్‌లకు సంబంధించిన ప్రముఖ తయారీదారుల్లో పేరుగాంచిన సంస్థగా గుర్తింపు పొందింది.
ఎన్టీపీసీ నుంచి త్రివేణి టర్బైన్‌కు రూ.290 కోట్ల ఆర్డర్ !
January 29, 2025
0
Tags