జపాన్‌ అకాడమీ ఫిల్మ్‌ ప్రైజ్‌ 2024 అవార్డులలో షార్ట్‌లిస్ట్‌లో 'లాపతా లేడీస్‌'

Telugu Lo Computer
0


పాన్‌ అకాడమీ ఫిల్మ్‌ ప్రైజ్‌ 2024 అవార్డులలో బెస్ట్‌ ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ కేటగిరీలో 'లాపతా లేడీస్‌' షార్ట్‌లిస్ట్‌ అయింది. 'ఓపెన్‌హైమర్‌', 'పూర్‌ థింగ్స్‌', 'ది జోన్‌ ఆఫ్ ఇంట్రెస్ట్‌', 'సివిల్‌ వార్‌' వంటి హాలీవుడ్‌ సినిమాలకు పోటీగా నిలిచింది. మార్చి 14న జరగనున్న వేడుకలో విజేతల వివరాలు ప్రకటించనున్నారు. నితాన్షీ గోయల్‌, ప్రతిభా రంతా, స్పర్శ్‌ శ్రీవాత్సవ ఛాయా కదమ్‌, రవి కిషన్‌ కీలక పాత్రల్లో కిరణ్‌ రావు తెరకెక్కించిన చిత్రం 'లాపతా లేడీస్‌'. గ్రామీణ ప్రాంతానికి చెందిన ఇద్దరు నవ వధువులు రైలు ప్రయాణంలో అనుకోకుండా తారుమారైన సంఘటన ఇతివృత్తంగా ఈ సినిమాని రూపొందించారు. టొరంటో ఇంటర్నేషనల్‌ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ (టీఐఎఫ్‌ఎఫ్‌) వేడుకలో ఈ చిత్రాన్ని ప్రదర్శించడం విశేషం. 'ఇండియన్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ మెల్‌బోర్న్ (ఐఎఫ్ఎఫ్ఎం)' అవార్డుల్లో  క్రిటిక్స్‌ ఛాయిస్‌ విభాగంలో ఉత్తమ సినిమాగా నిలిచింది. 2025 ఆస్కార్‌కు మనదేశం నుంచి ఎంపికైన ఈ చిత్రం షార్ట్‌లిస్ట్‌లో చోటు దక్కించుకోలేకపోయింది. గతేడాది మార్చిలో భారత్‌లో విడుదలైన ఈ చిత్రం.. అక్టోబరులో జపాన్‌లో విడుదలైంది.

Post a Comment

0Comments

Post a Comment (0)