రాజస్థాన్‌లోని అజ్మీర్‌లో షరీఫ్‌కి కాళ్లు లేకపోవడంతో భిక్షాటనపై ఆధారపడి జీవిస్తున్నాడు. అయితే, అతడు మొత్తం 1.7 లక్షల డబ్బును నగదు రూపంలో చెల్లించి ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ని కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేశాడు. శారీరకంగా వికలాంగుడైన షేక్ షరీఫ్ అనే బిచ్చగాడు ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ మొబైల్ కొనుగోలు చేసిన వీడియో సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతుంది. ఈ వీడియోపై పైసా కహాన్ సే ఆయా? అంటూ ఓ నెటిజన్ కామెంట్ చేయగా మరో యూజర్ ఇలా రాసుకొచ్చాడు.. భిక్షాటన చేయడం ఉత్తమ వ్యాపారం, పెట్టుబడి లేదు, ఉద్యోగం చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ఒత్తిడి లేదు అంటూ పేర్కొన్నాడు.
ఐఫోన్ 16 ప్రో మ్యాక్స్ ని కొనుగోలు చేసిన అజ్మీర్ బిచ్చగాడు !
January 20, 2025
0
Tags