దేశంలో గత ఏడాది 113 లంబోర్గిని కార్ల అమ్మకం !

Telugu Lo Computer
0


టాలియన్ సూపర్ కార్ల తయారీ సంస్థ లంబోర్గిని భారతదేశంలో 2024లో 113 కార్లను అమ్మింది.  2023తో పోలిస్తే 2024లో లంబోర్గిని విక్రయాలు 10 శాతం పెరిగాయి. ప్రపంచ వ్యాప్తంగా కంపెనీ 10,687 కార్లను విక్రయించింది. ఇందులో అధిక భాగం రెవెల్టో హైబ్రిడ్ స్పోర్ట్స్ కారు ఉంది. అంతకు ముందు ఏడాదిలో హురాకాన్ బాగా అమ్ముడుపోయింది. ఈ ఏడాది కంపెనీ ఉరుస్ ఎస్ఈ ప్లగ్-ఇన్ హైబ్రిడ్ కారును లాంచ్ చేసే అవకాశం ఉంది. గత ఏడాది అన్ని ప్రధాన మార్కెట్లలో కంపెనీ మంచి వృద్ధిని సాధించింది.  యూరప్, మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలలో 4,227 కార్లను విక్రయించింది. అమెరికాలో 3,712 యూనిట్లు, ఆసియా - పసిఫిక్ ప్రాంతంలో 2,748 యూనిట్లను విక్రయించింది. 

Post a Comment

0Comments

Post a Comment (0)