రష్యా టెన్నిస్‌ క్రీడాకారుడు డానిల్‌ మెద్వెదెవ్‌ 10 వేల డాలర్లు జరిమానా !

Telugu Lo Computer
0


స్ట్రేలియన్ ఓపెన్ 2025 బరిలోకి రష్యాకు చెందిన టెన్నిస్‌ క్రీడాకారుడు డానిల్‌ మెద్వెదెవ్‌ కు టోర్నీ క్రమశిక్షణ రాహిత్యంగా వ్యవహరించినందుకు గానూ నిర్వాహకులు జరిమానా విధించారు. తొలి రౌండ్ లో డానిల్‌ మెద్వెదెవ్‌ 418 ర్యాంక్ కసిడిట్ సామ్రెజ్ పై విజయం సాధించాడు. ఆ సమయంలో గెలుపు ఉత్సాహంతో అతడు తన రాకెట్ తో పలుసార్లు నెట్ కెమెరాను బాది దాన్ని నాశనం చేశాడు. దీంతో అతడికి క్రమశిక్షణ చర్యల కింద 10 వేల డాలర్లు జరిమానా వేశారు నిర్వాహకులు. మరోసారి అలా వ్యవహరించకూడదని హెచ్చరించారు. అయినా అతడి తీరు మారలేదు. రెండో మ్యాచ్ లోనూ అలానే ప్రవర్తించాడు. రెండో రౌండ్ లో మరీ దారుణంగా 19 ఏళ్ల అమెరికా కుర్రాడు క్వాలిఫయర్ లెర్నర్ టీన్ పై ఓటమి చెందాడు. 6-3, 7-6 (4), 6-7 (10), 1-6, 7-6 (7) తేడాతో ఓడిపోయాడు. దీంతో టీన్ తన రాకెట్ ను నేలకేసి బాదాడు. బంతిని కూడా బ్యాక్ వాల్ కేసి బాదాడు. తన రాకెట్ బ్యాగ్ ను కూడా విసిరేశాడు. మరోసారి కెమెరాపై కూడా బాదుతూ విరుచుపడ్డాడు. అలా తన అసంతృప్తి ప్రవర్తన తీరుతో ఇష్టమొచ్చినట్లు బిహేవ్ చేశాడు. దీంతో అతడిపై మరో క్రమశిక్షణ చర్యలు తీసుకున్న నిర్వాహకులు అతడికి ఏకంగా 66 వేల డాలర్ల జరిమానా విధించారు. అలా మొత్తంగా రెండో రౌండ్లలో కలిపి మొత్తం 76 వేల డాలర్ల ఫైన్ విధిస్తున్నట్లు తాజాగా ఆస్ట్రేలియన్ ఓపెన్ నిర్వాహకులు ప్రకటించారు. 


Post a Comment

0Comments

Post a Comment (0)