తెలంగాణలో వచ్చే ఐదు నెలల కోసం మిషన్ భగీరథ సిబ్బంది ప్రణాళిక రూపొందించుకోవాలి. వేసవి ముగిసే వరకు ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలి అని మంత్రి సీతక్క అన్నారు. గాలి తర్వాత నీరే మనుషులకు కావాలి. కోట్ల మందికి నిరంధించే అదృష్టం మనకే దక్కింది. ప్రతి మనిషికి 100 లీటర్ల నీటిని ప్రతిరోజు అందించాల్సిందే. గ్రామస్థాయిలో మండల స్థాయిలో క్రీమ్ కమిటీ వేసుకోండి. అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యలు తెలుసుకోవడంతోపాటు, మిషన్ భగీరథ నీళ్లపై నమ్మకం కలిగించేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టండి. మిషన్ భగీరథ పై వేల కోట్లు ఖర్చు చేసినా.. ప్రజలు ఎందుకు ఆ నీటిని పూర్తిస్థాయిలో వినియోగించడం లేదో అధ్యయనం చేయాలి. ఎంతమంది మిషన్ భగీరథ నీరు తాగునీటి కోసం వినియోగించడం లేదో సర్వేలు చేపట్టండి. అసెంబ్లీ నియోజకవర్గాల్లో ఎంత మేర మిషన్ భగీరథ తాగునీరు సరఫరా చేస్తున్నాము? ఎన్ని గృహాలకు నీరు అందటం లేదు వంటి వివరాలను ఎమ్మెల్యేలకు అందజేయండి. మిషన్ భగీరథ నీళ్లు వాడేలా అవగాహన కార్యక్రమాలు చేపట్టండి అని మంత్రి సీతక్క సూచించారు.
ప్రతి మనిషికి రోజుకు 100 లీటర్ల నీటిని అందించాలి : మంత్రి సీతక్క
January 29, 2025
0
Tags