తెలంగాణలో రెండు వారాలు సినిమా ప్రదర్శనల నిలిపివేత !

Telugu Lo Computer
0


తెలంగాణలో రెండు వారాల పాటు సినిమా ప్రదర్శనలు నిలిపివేయనున్నారు. సింగిల్‌ స్క్రీన్‌ థియేటర్లలో షోలు ఆపివేస్తామని యాజమాన్యాలు ప్రకటించాయి.ఆక్యుపెన్సీ తక్కువగా ఉండటంతో నష్టం ఎక్కువ వస్తోందని నిర్వాహకులు తెలిపారు. దీంతో సినిమాల ప్రదర్శనలు ఆపాలని నిర్ణయించామన్నారు. ఆర్థిక ఇబ్బందుల వల్ల స్వచ్ఛందంగా నిలిపివేస్తున్నట్లు వెల్లడించారు. నిర్మాతలు ప్రోత్సహించి థియేటర్‌ అద్దెలు పెంచాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పరిస్థితులు అనుకూలిస్తే ప్రదర్శనలు కొనసాగిస్తామని తెలిపారు.

Post a Comment

0Comments

Post a Comment (0)