మెట్రో ప్రయాణ వేళల్లో ఎలాంటి మార్పు లేదు !

Telugu Lo Computer
0


మెట్రో రైలు ప్రయాణ వేళల్లో మార్పులు చేశారంటూ వస్తున్న వార్తలు అవాస్తవమని ఎల్ అండ్ టీ అధికారులు తెలిపారు. మెట్రో రాకపోకల్లో ఎలాంటి మార్పులు చేయలేదని స్పష్టం చేశారు. కానీ ప్రయాణ వేళల్లో మార్పుపై పరిశీలన చేస్తున్నామని పేర్కొన్నారు. ప్రతి శుక్రవారం రాత్రి 11.45 గంటల వరకు, ప్రతి సోమవారం ఉదయం 5.30 గంటల నుంచే రైళ్ల రాకపోకలపై పరిశీలన మాత్రమే జరిగిందని, ఇంకా ఆ వేళలపై ఎలాంటి తుది నిర్ణయం తీసుకోలేదని ఎల్ అండ్ టీ అధికారులు తెలిపారు. ప్రయాణికుల రద్దీ, రైళ్లు, ట్రాక్‌ నిర్వహణ సాధ్యాసాధ్యాలను పరిశీలిస్తున్నట్టు తెలిపారు. ప్రయాణికులెవరూ మెట్రో రైళ్ల సమయం విషయంలో అయోమయానికి గురికావొద్దని, యథావిధిగానే ఉదయం 6 గంటల నుంచి రాత్రి 11 గంటల వరకు మెట్రో రైళ్లు నడుస్తాయని పేర్కొన్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)