ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి తల్లి వైఎస్ విజయమ్మ కీలక ప్రకటన చేశారు. కడప కాంగ్రెస్ ఎంపీ అభ్యర్థి షర్మిలకు ఓటు వేసి గెలిపించాలని ఆమె విజ్ఞప్తి చేశారు. ''కడప ప్రజలకు నా విన్నపం. వైఎస్సార్ ను అభిమానించే, ప్రేమించే వారికి నా హృదయ పూర్వక నమస్కారాలు. వైఎస్సార్ బిడ్డ షర్మిలమ్మ ఎంపీగా పోటీ చేస్తోంది. కడప జిల్లా ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి. ఆమెను గెలిపించి పార్లమెంటుకు పంపాలని మిమ్మల్ని ప్రార్థిస్తున్నా'' అని విజ్ఞప్తి చేశారు. మరి కొన్ని గంటల్లో పోలింగ్ జరగనుండగా విజయమ్మ ప్రకటన రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుతం అమెరికాలో ఉన్న ఆమె వీడియో సందేశం విడుదల కడప రాజకీయాలలోనే కాకుండా రాష్ట్ర రాజకీయాల్లో కూడా సంచలనం కల్గిస్తోంది.
షర్మిలమ్మను గెలిపించి ప్రజలకు సేవ చేసే అవకాశం కల్పించండి !
May 11, 2024
0
Tags