తెలుగు రాష్ట్రాలకు వర్ష సూచన !

Telugu Lo Computer
0

                                           

మే 11 నుంచి 15 వరకు పలు రాష్ట్రాల్లో వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖతెలిపింది. ఇందులో తెలుగు రాష్ట్రాలు కూడా ఉండడం విశేషం.  మే 13న తెలుగు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఎన్నికలు జరుగుతున్నాయి. ఇలాంటి సమయంలో వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. పోలింగ్ పై  ప్రభావం చూపే అవకాశం ఉంటుందని అధికారులు ఆందోళన చెందుతున్నారు. హిమాచల్ ప్రదేశ్, లడఖ్, జమ్మూ కాశ్మీర్, హర్యానా, ఉత్తరాఖండ్, పంజాబ్, ఛండీఘడ్, రాజస్థాన్, ఝార్ఖండ్, పశ్చిమబెంగాల్, సిక్కిం, బీహార్, గోవా, ఛతీస్ గడ్, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ వెల్లడించింది.

Post a Comment

0Comments

Post a Comment (0)