వధువు ముసుగు తీసి ఖంగుతిన్న వరుడు !

Telugu Lo Computer
0


సోషల్ మీడియాలో ఓ వీడియో తెగ వైరల్ అవుతోంది. ఓ వివాహ కార్యక్రమంలో వధూవరులు ఇద్దరూ సోఫాలో కూర్చుని ఉంటారు. అయితే వధువు మాత్రం మొఖంపై ముసుగు ధరించి ఉంటుంది. కాసేపు సైలెంట్‌గా ఉన్న వరుడు ఆ తర్వాత వధువును చూడాలని ప్రయత్నిస్తాడు. ఈ క్రమంలో ఆమె మొఖంపై ఉన్న ముసుగును మెల్లగా పైకి తీస్తాడు. అయితే చివరకు లోపల వధువుకు బదులుగా ఓ యువకుడి మొఖం చూసి ఖంగుతింటాడు. చివరకు తాను ఫూల్ అయ్యానని తెలుసుకున్న వరుడు ఒక్కసారిగా కోపంతో ఊగిపోతాడు. ''ఇలాంటి పిచ్చి పిచ్చి పనులతో నన్ను ఫూల్ చేస్తారా'' అంటూ అతడిపై చేయి చేసుకుంటాడు. వరుడు ఫూల్ అవడం చూసి పక్కన ఉన్న వారంతా పగలబడి నవ్వుకుంటారు. అదే కలర్ చీర కట్టుకున్న వధువు ఆ పక్కనే కూర్చుని ఉంటుంది. పక్కన ఉన్న వారితో పాటూ ఆమె కూడా నవ్వుతూ ఎంజాయ్ చేస్తుంది. కాగా, ఈ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది. దీనిపై నెటజన్లు వివిధ రకాలుగా స్పందిస్తున్నారు. ''కామెడీ మామూలుగా లేదుగా''.. అంటూ కొందరు, ''పెళ్లికొడుకును భలే ఫూల్ చేశారే''.. అంటూ ఇంకొందరు, వివిధ రకాల ఎమోజీలతో ఇంకొందరు కామెంట్లు చేస్తున్నారు. ఈ వీడియో ప్రస్తుతం 1.7 లక్షకు పైగా వ్యూస్‌ను సొంతం చేసుకుంది.

Post a Comment

0Comments

Post a Comment (0)