తెలంగాణాలో ఎండల ప్రభావంతో కరెంట్వినియోగం పీక్స్‌కు చేరింది. నిజానికి యాసంగి పంటకాలం ముగిసినందున ఏప్రిల్ రెండోవారం నుంచే కరెంట్ వినియోగం తగ్గాలి. కానీ గృహ వినియోగం పెరగడంతో ఆ మేరకు కరెంట్ డిమాండ్ చుక్కలను తాకుతున్నది. ముఖ్యంగా నాలుగైదు రోజుల నుంచి తీవ్ర వడగాలులు, ఉక్కపోతల నేపథ్యంలో రాష్ట్రమంతా ఫ్యాన్లు, కూలర్లు, ఏసీల వాడకం భారీగా పెరగడంతో పాత రికార్డులన్నీ కొట్టుకుపోతున్నాయి. 2023 ఏప్రిల్ 30న రాష్ట్రంలో155.9 మిలియన్‌యూనిట్ల వినియోగం ఉండగా, ఈ ఏడాది సరిగ్గా ఇదే రోజు విద్యుత్ డిమాండ్ 228 మిలియన్ యూనిట్లకు చేరింది. అయినా పెరిగిన డిమాండ్‌కు అనుగుణంగా ఎలాంటి పవర్ కట్స్ లేకుండా సర్కారు చర్యలు తీసుకుంటున్నది. రాష్ట్రంలో జెన్కో, సింగరేణి నుంచి గరిష్ఠంగా 86 నుంచి103 మిలియన్యూనిట్లు మాత్రమే విద్యుదుత్పత్తి ఉండగా, ఈ కొరతను అధిగమించేందుకు వివిధ రాష్ట్రాలతోపాటు కేంద్ర విద్యుదుత్పత్తి సంస్థల నుంచి కొనుగోలు చేస్తున్నది. నిరుడు ఏప్రిల్ నెలలో 7 వేల మెగావాట్ల నుంచి 8 వేల మెగావాట్ల వరకు కరెంట్డిమాండ్ఉండగా, ఈ సారి 10 వేల నుంచి 11 వేల మెగావాట్లకు చేరింది. అంటే రోజుకు 3 వేల మెగావాట్ల దాకా అదనంగా డిమాండ్ఉంటోంది. 2023 ఏప్రిల్30న 155.9 మిలియన్ యూనిట్ల వాడకం ఉంటే.. ఈ ఏడాది అదే రోజు 228 మిలియన్ యూనిట్ల డిమాండ్ నమోదైంది. 2023 ఏప్రిల్ 29,28,27, 26వ తేదీల్లో167.8 మిలియన్యూనిట్లు,178.55 మిలియన్యూనిట్లు,177.02 మిలియన్యూనిట్లు, 159.00 మిలియన్‌యూనిట్ల విద్యుత్ డిమాండ్ నమోదుకాగా, సరిగ్గా ఈ ఏడాది అవే తేదీల్లో వరుసగా 229.5 , 218.85 , 227.77, 228.18 మిలియన్ యూనిట్ల విద్యుత్‌డిమాండ్ ఏర్పడింది. అంటే రోజుకు సగటున 50 మిలియన్ యూనిట్ల నుంచి 75 మిలియన్ యూనిట్ల వరకు ఎక్కువ విద్యుత్వినియోగం జరుగుతోంది. ఎండల తీవ్రత కు తోడు గృహ విద్యుత్వినియోగం పెరగడంతో రాష్ట్రంలో రోజూవారీ కరెంట్ డిమాండ్ 220 యూనిట్లు దాటుతోంది. మంగళవారం రాష్ట్రంలో 229 మిలియన్‌యూనిట్ల డిమాండ్ ఏర్పడగా, ఉత్పత్తి అవుతున్నది కేవలం 97 మిలియన్ యూనిట్లే. టీఎస్ జెన్కో దగ్గర 64 మిలియన్ యూనిట్ల నుంచి 79 మిలియన్ యూనిట్ల ఉత్పత్తి ఉండగా, సింగరేణి థర్మల్ ప్లాంట్ నుంచి మరో 22 మిలియన్ యూనిట్ల నుంచి 24 మిలియన్‌యూనిట్ల దాకా ప్రొడక్షన్ ఉంటోంది. అంటే నిత్యం125 మిలియన్ యూనిట్ల నుంచి 150 మిలియన్ యూనిట్ల దాకా లోటు ఏర్పడుతోంది. కానీ ఎట్టిపరిస్థితుల్లో కరెంట్ కోతలు లేకుండా చూడాలన్న సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ఆదేశాలతో విద్యుత్‌శాఖ ఉన్నతాధికారులు సెంట్రల్ పవర్ జనరేషన్ స్టేషన్లతో పాటు ఇతర రాష్ట్రాల్లోని పవర్ బ్యాంక్ పాలసీల ద్వారా కరెంట్ కొనుగోలు చేసి, నిరంతరాయంగా కరెంట్ సరఫరా చేస్తున్నారు.
తెలంగాణ లో పీక్ స్టేజీకి చేరిన కరెంట్ డిమాండ్ !
May 01, 2024
0
Tags