గుజరాత్‌లోని వడాలిలో ఆన్‌లైన్‌లో ఆర్డర్ చేసిన పార్శిల్ ఇంటికి వచ్చింది. బుధవారం ఆ పార్శిల్‌ను ఓపెన్ చేయగానే వెంటనే పేలిపోయింది. ఈ ఘటనలో జితేంద్ర హీరాభాయ్ వంజారా, ఆయన కుమార్తె భూమిక వంజారా ప్రాణాలు కోల్పోయారు. ఇదే ఘటనలో 9, 10 ఏళ్ల వయసు ఉన్న మరో ఇద్దరు కుమార్తెలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానిక ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ఆన్‌లైన్‌లో ఆర్డర్ పెట్టిన పార్శిల్ ఇంటి వద్ద పేలిన సంఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. ఇద్దరు మృతి చెందడంతో పాటు మరో ఇద్దరు గాయపడటంతో స్థానికులు భాయాందోళనకు గురయ్యారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు పార్శిల్‌ను స్వాధీనం చేసుకున్నారు. బాంబు స్క్వాడ్‌ను రప్పించి ఆధారాలను కూడా సేకరించారు. పార్శిల్‌ను ఎవరు డెలివరీ చేశారు..? అది పేలడానికి గల కారణాలపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
ఆన్లైన్లో ఆర్డర్ చేసిన పార్శిల్ పేలి ఇద్దరు మృతి !
May 02, 2024
0
Tags