ప్రముఖ యూట్యూబర్‌గా సామాజిక మాధ్యమాలలో పేరు పొందిన సిమ్రాన్ యాదవ్ అనే యువతి సోషల్ మీడియాలో ఓ రీల్ పోస్టు చేసింది. అందులో లఖ్‌నవూలోని ఓ హైవేపై గన్ చేతిలో పట్టుకొని ఓ పాటకు డాన్స్ చేస్తూ కనిపించింది. రద్దీగా ఉన్న ప్రాంతంలో యువతి గన్‌ను ఉపయోగిస్తూ రీల్ చేయడంపై నెటిజన్లు మండిపడ్డారు. వీడియోపై ఓ నెటిజన్ స్పందిస్తూ ''లఖ్‌నవూ ఇన్‌స్టాగ్రామ్ స్టార్ సిమ్రాన్ ప్రమాదకరంగా తుపాకితో రీల్ చేస్తూ బహిరంగంగా చట్టాలను అతిక్రమిస్తుంటే అధికారులు మౌనంగా ఉన్నారు'' అని పోలీసులను టాగ్ చేశారు. స్పందించిన పోలీసులు విచారణ జరిపి, యువతిపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. కాగా సిమ్రాన్‌కు ఇన్‌స్టాగ్రామ్‌లో 2.2 మిలియన్లకు పైగా ఫాలోవర్లు, యూట్యూబ్‌లో 1.8 మిలియన్లకు పైగా సబ్‌స్క్రైబర్లు ఉన్నారు.
వివాదంలో యూట్యూబర్ సిమ్రాన్ యాదవ్
May 11, 2024
0
Tags