పశ్చిమ బెంగాల్ లోని హుగ్లీ జిల్లా, చిన్‌సురహ్‌లో బుధవారంనాడు జరిగిన ఎన్నికల ర్యాలీలో మమతా బెనర్జీ మాట్లాడుతూ టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు విషయంలో తమ మద్దతుపై స్పష్టత ఇచ్చారు. బీజేపీ 400 సీట్లు గెలుస్తామని చెబుతున్నప్పటికీ ఈసారి అది జరగదని ప్రజలు చెబుతున్నారని అన్నారు., కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 'ఇండియా' కూటమికి బయట నుంచి తాము మద్దతిస్తామని తెలిపారు. ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆదేశాలతో ఎన్నికల కమిషన్ ఒక కీలుబొమ్మలా పనిచేస్తోందని మమతా బెనర్జీ విమర్శించారు. రెండున్నర నెలల పాటు ఎన్నికల షెడ్యూల్ ఉండటాన్ని తప్పుపడుతూ కాషాయం పార్టీకి అనుకూలంగా ఈసీ వ్యవహరించిందన్నారు. మండుటెండల్లో ప్రజలు పడే కష్టాలు ఎన్నికల అధికారులకు తెలియవా అని ప్రశ్నించారు. లోక్‌సభ ఎన్నికలు మధ్యలో ఉండగా ఆయుష్మాన్ భారత్ యోజనను 70 ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు వర్తింపజేసే ఆలోచన ఉందని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ప్రకటించడాన్ని మమతా బెనర్జీ తప్పుపట్టారు. ఓవైపు ఎన్నికలు జరుగుతుండగా మోడీ కీలక ప్రకటన ఎలా చేస్తారని ప్రశ్నించారు. ఇది కచ్చితంగా ఆయన ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించడమే అవుతుందన్నారు. బెంగాల్‌లో పౌరసత్వ సవరణ చట్టం (సీఏఏ), నేషనల్ రిజిస్టర్ ఆఫ్ సిటిజెన్స్ (ఎన్ఆర్‌సీ), ఉమ్మడి పౌర స్మృతి (యూసీసీ)ని అమలు చేసే ప్రసక్త లేదని, ఇందుకు తాము కట్టుబడి ఉంటామని బెనర్జీ పునరుద్ఘాటింటారు.
కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటుకు 'ఇండియా' కూటమికి బయట నుంచి మద్దతిస్తాం !
May 15, 2024
0
Tags