ఏపీ, తెలంగాణలో బీజేపీకి మెరుగైన ఫలితాలుంటాయి !

Telugu Lo Computer
0


కేంద్ర హోంమంత్రి అమిత్ షా నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ జోషికి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఎన్నికలకు సంబంధించిన అన్ని అంశాలపై సుదీర్ఘంగా మాట్లాడారు. ఎన్నికల్లో తమ వ్యూహాలు, ఇతర ప్రణాళికల గురించి ఈ ఇంటర్వ్యూలో అమిత్ షా వివరించారు. ఈసారి ఎన్డీయేకు 400 సీట్లు గ్యారంటీ అని ధీమా వ్యక్తం చేశారు. అంతేకాదు ఏపీ, తెలంగాణలో బీజేపీ ప్రదర్శన ఎలా ఉండబోతోందో కూడా వెల్లడించారు. మీరు తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లను ఎలా చూస్తారని అమిత్ షాని.. నెట్‌వర్క్ 18 గ్రూప్ ఎడిటర్ ఇన్ చీఫ్, మేనేజింగ్ డైరెక్టర్ రాహుల్ జోషి అడగ్గా, దానిపై మాట్లాడిన అమిత్ షా ఆంధ్రప్రదేశ్‌లో తమకు పొత్తు ఉందని, ఈసారి మంచి ఫైట్ ఉంటుందని, ఇది ఆరంభం మాత్రమేనని తెలిపారు. తెలంగాణలో లోక్‌సభ ఎన్నికల్లో ఖచ్చితంగా మెరుగైన ప్రదర్శన ఇస్తామని, ఈ సారి అక్కడ వీలైనన్ని ఎక్కువ సీట్లు గెలుస్తామని ధీమా వ్యక్తం చేశారు. కౌంటింగ్ రోజున మధ్యాహ్నం 12:30 గంటల్లోపు, ఎన్డీఏ 400 సీట్ల మార్క్ దాటుతుందని ఆయన ధీమా వ్యక్తం చేశారు. మోడీ మళ్లీ ప్రధానమంత్రి అవుతారని చెప్పారు. మొదటి రెండు దశల పోలింగ్‌ను విశ్లేషిస్తే 400 లక్ష్యాన్ని దాటడంలో ఎలాంటి ఇబ్బంది కనిపించడం లేదని స్పష్టం చేశారు.


Post a Comment

0Comments

Post a Comment (0)