ప్రధాని మోడీకి వచ్చే ఏడాది 75 ఏళ్లు నిండుతాయని అప్పుడు పదవీ విరమణ చేస్తారా? అని ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ ప్రశ్నించారు. బీజేపీ ప్రధానిగా ఎవరు ఉంటారు? అని ప్రశ్నించారు. ఇండియా బ్లాక్ ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీ అడుగుతోందని, అయితే వారి ప్రధాన మంత్రి అభ్యర్థి ఎవరని బీజేపీని తాను అడుగుతున్నానని అన్నారు. 75 ఏళ్ల తర్వాత బీజేపీలోని నేతలు రిటైర్ కావాలన్న నిబంధన మోడీ పెట్టారని చెప్పారు. లాల్ కృష్ణ అద్వానీ, మురళీ మనోహర్ జోషి, సుమిత్రా మహాజన్, యశ్వంత్ సిన్హా రిటైర్ అయ్యారని, అలాగే వచ్చే ఏడాది సెప్టెంబర్ 17న మోడీ రిటైర్ కాబోతున్నారా? అని సీఎం కేజ్రీవాల్ ప్రశ్నించారు.
మోడీకి 75 ఏళ్లు నిండుతాయి, పదవీ విరమణ చేస్తారా?
May 11, 2024
0
Tags