భారతీ లేక్‌వ్యూ పేరుతో తక్కువ ధరకే ప్లాట్స్ అంటూ నమ్మించి కోట్లు దండుకున్న వ్యక్తిని పోలీసులు అరెస్ట్ చేశారు. కొంపల్లిలో భారతీ లేక్‌వ్యూ ప్రీ-లాంచ్ పేరుతో భారతీ బిల్డర్స్ చైర్మన్ దూపాటి నాగరాజు ఆఫర్ ప్రకటించారు. అతి తక్కువ ధరకు ఫ్లాట్స్ అంటూ 350 మంది నుంచి దాదాపు రూ. 60 కోట్ల వరకు వసూళ్లు చేశాడు. అయితే డబ్బులు వసూలు చేసి నిర్మాణం చేపట్టలేదు . దీంతో భారతీ బిల్డర్స్‌పై సైబరాబాద్ పోలీసులకు బాధితులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన సైబరాబాద్ ఎకనమిక్స్ అఫెన్స్ వింగ్ పోలీసులు నాగరాజుతో పాటు భారతీ బిల్డర్ ఎండీ శివరామకృష్ణ, సీఈఓ నరసింహరావులను అరెస్ట్ చేశారు.
తక్కువ ధరకే ఫ్లాట్స్ అంటూ రూ.60 కోట్లు టోకరా !
May 18, 2024
0
Tags