రెండు తెలుగురాష్ట్రాల్లో ఎన్నికల సందర్భంగా దక్షిణ మధ్య రైల్వే కీలక నిర్ణయం తీసుకుంది . ఈ నెల 13 న జరుగునున్న పోలింగ్ను దృష్టిలో ఉంచుకుని సొంత ప్రాంతాలకు వెళ్లే వారి కోసం 22 రైళ్లకు అదనపు కోచ్ లను ఏర్పాటు చేసింది. మే 10 నుంచి 14వ తేదీ వరకు ఆయా రైళ్లలో థర్డ్ ఏసీ, సెకెండ్ ఏసీ, స్లీపర్, చైర్ కార్లలో అదనపు కోచ్ లను ఏర్పాటు చేసినట్లు దక్షిణ మధ్య రైల్వే చీఫ్ పబ్లిక్ రిలేషన్ ఆఫీసర్ రాకేశ్ తెలిపారు. అదనపు కోచ్ ల ఏర్పాటు వల్ల వెయిటింగ్ లిస్ట్ లో ఉన్న ప్రయాణికులకు కొంత ఉపశమనం కలగనుందని ఆయన వెల్లడించారు.
ఎన్నికల సందర్భంగా 22 రైళ్లకు అదనపు కోచ్ లు !
May 09, 2024
0
Tags