WAISLలో వాటాను కొనుగోలు చేయనున్న జీఎంఆర్‌ !

Telugu Lo Computer
0


జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ తన విమానాశ్రయ సంబంధిత వ్యాపారాలను మెరుగుపరచుకోవడానికి విమానాశ్రయాలలో డిజిటల్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సర్వీస్‌ ప్రొవైడర్‌ WAISLలో 8.40 శాతం వాటాను కొనుగోలు చేయనున్నట్లు మంగళవారం తన రెగ్యులేటరీ ఫైలింగ్‌లో తెలిపింది. ఎయిర్‌పోర్ట్‌ కార్యకలాపాలను బలోపేతం చేసే లక్ష్యంతో ఉత్తిష్ట విరాట్‌ ఫండ్‌ నుంచి 4,60,000 WAISL షేర్లను రూ.56.66 కోట్లకు కొనుగోలు చేయడానికి కంపెనీ ఒప్పందం కుదుర్చుకుంది. జీఎంఆర్‌ ఎయిర్‌పోర్ట్స్‌ ఇన్‌ఫ్రా ద్వారా delhi , హైదరాబాద్‌, గోవా, ఫిలిప్పీన్స్‌లోని విమానాశ్రయాలను నిర్వహిస్తోంది. జీఎంఆర్‌ కంపెనీ.. ఎయిర్‌పోర్ట్స్‌ వ్యాపారానికి సంబంధించిన అన్ని అంశాలలో తన ఉనికిని విస్తరించుకోవడంపై దృష్టి సారించింది. WAISL.. 2009 నుంచి విమానాశ్రయాలలో డిజిటల్‌ మౌలిక సదుపాయాలను అందించే వ్యాపారంలో ఉంది. ఇది విమానాశ్రయాల్లో ఐటీ సేవలు అందించే ప్రత్యేక భాగస్వామిగా పని చేస్తోంది.

Post a Comment

0Comments

Post a Comment (0)