తిరుమలలో ఎండ తీవ్రత తట్టుకోలేక కాళ్లకు గోనెసంచులు కట్టుకున్న భక్తులు !

Telugu Lo Computer
0


తిరుమల కొండపై విపరీతంగా ఎండ తీవ్రత పెరిగింది. మధ్యాహ్నం సమయంలో ఎండను చూస్తే నిప్పుల కొలిమిలా అనిపిస్తోంది. ఈ క్రమంలో ఆలయ పరిసర ప్రాంతాల్లోని కాలిబాట కూల్ పెయింట్ కొన్ని చోట్ల వేయకపోవడంతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కొందరు భక్తులు ఆ వేడి నుంచి పాదాలను కాపాడుకునేందుకు ఇలా కాళ్లకు లడ్డూ ప్రసాద వితరణకు వినియోగించే జూట్ బ్యాగులను పాదాలకు ధరించి భక్తులు నడుస్తున్నారు. రానున్న రోజుల్లో ఎండలు మరింత తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించిన నేపథ్యంలోనే టీటీడీ వెంటనే చర్యలు తీసుకోవాలని భక్తులు డిమాండ్ చేస్తున్నారు. టీటీడీ కూల్ పెయింట్ వేసి వేసవి ఉపశమన చర్యలు చేపట్టాలని భక్తులు కోరుతున్నారు.

Post a Comment

0Comments

Post a Comment (0)