అవమానం తట్టుకోలేక బాలిక ఆత్మహత్య !

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని చిత్తూరు జిల్లా పుంగనూరు మండలంలో ఇటుకల బట్టీలో పనికి తీసుకెళ్లి బాలికపై అత్యాచారం చేయడంతో అవమానంతో బాలిక ఆత్మహత్య చేసుకుంది. కమతంపల్లి గ్రామానికి చెందిన చెందిన ఆనంద్‌, ధనలక్ష్మి దంపతుల కుమార్తె హేమలత (17). బాలిక తన తల్లితో కలిసి అదే గ్రామానికి చెందిన గణేష్‌తోపాటు ఇటుకల బట్టీలో పనికి వెళ్లింది. ఈ సమయంలో గణేష్‌ ఆ బాలికపై అత్యాచారం చేశాడు.బాలిక కేకలు వేయడంతో బాలిక తల్లి కుమార్తెను కాపాడే ప్రయత్నం చేసింది. ఆ సమయంలో నిందితుడు గణేష్‌ పరారయ్యాడు. ఇలా ఉండగానే బాలిక తీవ్ర మనస్తాపానికి గురై ఇటుకల బట్టీ వద్ద ఉన్న చెట్టుకు ఉరి వేసుకుంది. వెంటనే తల్లి, గ్రామస్తులు కలసి కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. బాలిక అప్పటికే మృతి చెందడంతో ఆ కుటుంబం విషాదంలో మునిగిపోయింది. ఈ మేరకు బాధిత కుటుంబం పోలీసులకు ఫిర్యాదు చేసింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది.

Post a Comment

0Comments

Post a Comment (0)