ప్రస్తుతం దేశం కీలక దశలో ఉంది. దేశాన్ని నిర్మించే వారికి.. దేశాన్ని నాశనం చేసేవారికి మధ్య ఉన్న వ్యత్యాసం ప్రతి వర్గం గుర్తించాలి అని రాహుల్ గాంధీ ఎక్స్ (ట్విటర్) ఖాతాలో పోస్ట్ చేశారు. కాంగ్రెస్ & ఇండియా అంటే యువతకు ఉద్యోగావకాశాలు, రైతులకు మినిమమ్ సపోర్ట్ ప్రైస్ హామీ, ప్రతి పేద మహిళ లక్షాధికారి కావడం, కార్మికులకు రోజుకు కనీసం రూ. 400, కులగణన, ఆర్థిక సర్వే మాత్రమే కాకుండా సురక్షితమైన రాజ్యాంగం, పౌరుల హక్కులు అని వివరించారు. బీజేపీ అంటే నిరుద్యోగం, రైతులకు అప్పుల భారం, మహిళలకు రక్షణ లేకుండా పోవడం, నిస్సహాయ కార్మికులు, వెనుకబడిన వర్గాల పట్ల వివక్ష, దోపిడీ మాత్రమే కాకుండా నియంతృత్వం, మోసపూరిత ప్రజాస్వామ్యం అని రాహుల్ గాంధీ పేర్కొన్నారు. మీ భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, ఆలోచించండి, అర్థం చేసుకోండి, సరైన నిర్ణయం తీసుకోండి అని రాహుల్ గాంధీ అన్నారు.
భవిష్యత్తు మీ చేతుల్లో ఉంది, సరైన నిర్ణయం తీసుకోండి !
April 04, 2024
0
Tags