నయీం కేసును మళ్లీ తెరిచి విచారణ జరిపించాలి ?

Telugu Lo Computer
0


కాంగ్రెస్ సీనియర్ లీడర్, మాజీ పార్లమెంట్ సభ్యుడు వీ.హనుమంత రావు గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ దివంగత గ్యాంగ్‌స్టర్ నయీం కేసును మళ్లీ తెరిచి విచారణ జరిపించాలని ఆయన డిమాండ్ చేశారు. నయీం కేసులో పోలీసు అధికారుల పాత్ర తేల్చాలని వి. హనుమంతరావు కోరారు. బీఆర్ఎస్ ప్రభుత్వం కేసును నీరుగార్చిందని ,నయీమ్ కేసులో ఉన్న నాయకులు, పోలీసు అధికారులు ఎవరో ప్రజలకు తెలియాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయం వ్యక్తం చేశారు. నయీంకు చెందిన వందల కోట్ల ఎకరాలు, పేదల భూములు ఎక్కడకు పోయాయి? అని ప్రశ్నించారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దేశంలోనే సంచలనంగా మారిందని.. దీనిని కూడా సీరియస్‌గా తీసుకోవాలని ఆయన కోరారు. ఈ కేసులో ఇప్పటికే పోలీస్ అధికారులు జైలుకు పోయారని.. తప్పు చేసిన వారిని ప్రభుత్వం వదిలిపెట్టదని వార్నింగ్ ఇచ్చారు.

Post a Comment

0Comments

Post a Comment (0)