ఫోన్‌ ట్యాపింగ్‌ కేసులో ఇరికించేందుకు కుట్ర ?

Telugu Lo Computer
0


తెలంగాణ రాష్ట్రంలో తీవ్ర చర్చనీయాంశమవుతున్న ఫోన్‌ ట్యాపింగ్‌ వ్యవహారంతో తనకు ఎలాంటి సంబంధం లేదని మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌ రావు అన్నారు. ఈ కేసులో తనను ఇరికించేందుకు కుట్ర చేస్తున్నారని ఆరోపించారు. జైలుకు పంపినా వెళ్తాను గానీ, పార్టీ మారబోనని అన్నారు. గతంలో రైతుల కోసం పోలీసులతో దెబ్బలు తిని జైలుకు వెళ్లినట్లు గుర్తుచేశారు. హామీలను అమలుచేయాలని అడిగితే కేసులతో భయపెడుతున్నారని విమర్శించారు. భారాసను మళ్లీ తెరాసగా మార్చాలని ఆలోచన చేస్తున్నట్లు చెప్పారు.

Post a Comment

0Comments

Post a Comment (0)