మాల్దీవుల విజ్ఞప్తిపై బియ్యం, గోధుమల ఎగుమతి !

Telugu Lo Computer
0


మాల్దీవులు చేసిన విజ్ఞప్తి మేరకు ఆ దేశానికి పరిమిత స్థాయిలో బియ్యం, గోధుమలు సహా పలు నిత్యావసర వస్తువుల ఎగుమతికి భారత ప్రభుత్వం గ్రీన్‌సిగ్నల్ ఇచ్చింది. ఈ వస్తువుల ఎగుమతిపై ఏప్రిల్ 1 నుంచి 2024-25 సంవత్సరానికి నిషేధం ఉంది. అయితే ఇప్పుడు మాల్దీవులు చేసిన విజ్ఞప్తిపై ఆ దేశానికి నిత్యావసర వస్తువుల ఎగుమతులపై ఉన్న నిషేధాన్ని నుంచి కేంద్రం మినహాయింపు ఇచ్చింది. మాల్దీవులు కొత్త అధ్యక్షుడు మహమ్మద్ మయిజ్జు ఎన్నికైనప్పటికి నుంచి భారత్-మాల్దీవుల మధ్య సంబంధాల్లో క్షీణత కనిపించింది. ఆ దేశం చైనాకు దగ్గరవుతూ భారత్‌కు చేరవవుతున్న సంకేతాలు వెలువడ్డాయి. ఈ నేపథ్యంలో మాల్దీవుల విజ్ఞప్తికి భారత్ సానుకూలంగా స్పందించడం ప్రాధాన్యత సంతరించుకుంది. మాల్దీవులకు పరిమిత స్థాయిలో ఎగుమతులకు భారత్ తాజాగా అంగీకరించిన వస్తువుల్లో బియ్యం, గోధుమ పిండి, బంగాళాదుంపలు, ఉల్లిపాయలు, కంకరరాయి, నది ఇసుక వంటివి ఉన్నాయి.

Post a Comment

0Comments

Post a Comment (0)