ఆంధ్రప్రదేశ్ లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి

Telugu Lo Computer
0


ఆంధ్రప్రదేశ్ లోని పెందుర్తి, అక్కిరెడ్డిపాలెంలో టాటా వ్యాన్ ను ఓ లారీ ఢీకొట్టిన ఘటనలో ముగ్గురు మృతి చెందారు. మరో 10 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరంతా పశ్చిమగోదావరి జిల్లా కొవ్వూరుకు చెందిన వారిగా పోలీసులు గుర్తించారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం కేజీహెచ్కు తరలించారు. పెందుర్తి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదంలో హనుమంతు ఆనందరావు (45).. హనుమంతు శేఖర్ రావు (15).. చింతాడి ఇందు (65)లు మృత్యువాత పడ్డట్టు పోలీసులు నిర్ధారించారు.

Post a Comment

0Comments

Post a Comment (0)